Home Blog

డాలస్ లో మహాత్మా గాంధీకి ఘన నివాళి

0

డాలస్టెక్సాస్: ఎంతో మంది ప్రవాస భారతీయులు డాలస్ (ఇర్వింగ్) లో ఉన్న మహాత్మా గాంధీ మెమోరియల్ ను సందర్శించి జాతిపిత 70వ వర్ధంతిని పురస్కరించుకుని గాంధీ పాదాల వద్ద పుష్పాలను ఉంచి ఘన నివాళి అర్పించారు. ఎస్ పి నాగ్రాత్ అనే స్థానిక గాయకుడు గాంధీజీకి ఇష్టమైన రఘుపతి రాఘవ రాజారామ్ కీర్తనను ఆలపించారు.

మహాత్మా గాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ కార్యదర్శి రావు కల్వల మాట్లాడుతూ స్థానిక ప్రజల సహకారంతో అతి పెద్ద గాంధీ మెమోరియల్ ను ఇక్కడ నిర్మించుకోవడం, భావితరాలకు స్ఫూర్తిదాయకంగా చూపడానికి అవకాశం కలిగిందని, గాంధీజీ సేవలను స్మరించుకోవడానికి వచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.

గాంధీ మెమోరియల్ ఛైర్మన్ డాక్టర్. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ గాంధీజీ 70 సంవత్సరాల క్రితం మరణించినప్పటికీ ఆయన సిద్ధాంతాలు,ఆశయాలతో మనందరి మధ్య ఎప్పటికీ సజీవంగానే ఉంటారని అన్నారు. దేశ స్వాతంత్ర సమపార్జనలో దాదాపు 32 సంవత్సరాల తన జీవతాన్ని అంకితం చేసి లక్షలాది ప్రజలను నిరంతరం చైతన్య పరచి, అహింసా మార్గం ద్వారా దేశానికి స్వాతంత్రం సాధించిన తీరు అనితర సాధ్యం అని,ప్రవాస భారతీయులుగా మనమందరం గాంధీ చూపిన బాటలో పయనిస్తూ సమానత్వం, సామాజిక న్యాయం ఉండే ఒక మంచి సమాజ స్థాపనకు అందరూ కృషి చేయాలని అన్నారు.

గాంధీ మెమోరియల్ బోర్డు ఆఫ్ డైరెక్టర్ కమల్ కౌషల్ గాంధీజీ విశ్వ మానవాళికి ఒక ఆదర్శప్రాయమైన వ్యక్తి అని, ఆయన సిద్ధాంతాలతో ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది ఉత్తేజితులయ్యారని అన్నారు.

ఐఏఎన్టి ఉపాధ్యక్షులు బిఎన్ మాట్లాడుతూ గాంధీజీ శాంతి, సహనానికి ప్రతి రూపమని, ఆయన గురించి ముఖ్యంగా యువతరం ఎంతో తెలుసుకొని తమ భవిష్యత్తును తీర్చుదిద్దుకోవచ్చని చెప్పారు.

మహాత్మా గాంధీ మెమోరియల్ బోర్డు ఆఫ్ డైరెక్టర్ షబ్నమ్ మోద్గిల్ గాంధీజీ తన సాధారణ, పారదర్శక జీవితంతో ఎంతో మందికి ఆదర్శప్రాయులయ్యారని, ఆయనకు మరణం లేదని ఎన్ని దశాబ్దాలైనా అందరూ జాతిపితను గుర్తించుకుంటారని చెప్పారు.

తక్షణమే ఏపీ డిమాండ్లను పరిశీలించాలి.. నాట్స్ 

0
ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో సరైన నిధులు కేటాయించకపోవడంపై నార్త్  అమెరికా తెలుగు సంఘం (NATS) నిరసన వ్యక్తం చేసింది. విభజన సమయంలో ఇచ్చిన హామీల అమలుపై కేంద్రం ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి యావత్ తెలుగు ప్రజలను మనోవేదనకు గురి చేస్తుందని నాట్స్ ఓ ప్రకటనలో తెలిపింది. ఆంధ్రప్రదేశ్ కు రైల్వేజోన్, రెవిన్యూ లోటు భర్తీ అంశాలపై కేంద్రం ఇంకా నాన్చుడు ధోరణి అవలంభించడాన్ని నాట్స్ ఖండించింది.. ప్రత్యేక హోదాకు బదులుగా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెప్పిన కేంద్రం.. ఆ ప్యాకేజీ ప్రయోజనాలను ఇంతవరకు అందించపోవడం ఎంతవరకు సమంజసం అని నాట్స్ బోర్డ్ ఛైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ ప్రశ్నించారు. ప్రపంచంలో తెలుగువారికి ఎక్కడ ఏ అన్యాయం జరిగినా నాట్స్ స్పందిస్తుందన్నారు. విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ ను ఉదారంగా ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన హామీల కోసం తెలంగాణ ఎంపీలు కూడా మద్దతు పలకడాన్ని ఆయన స్వాగతించారు. ఇలాంటి సమయాల్లో తెలుగువారు ఎక్కడుఉన్నా అంతా ఏకతాటిపైకి వచ్చి తమ వాణిని వినిపించాల్సిన అవసరముందని . తక్షణమే కేంద్రం ఏపీకి  కేంద్ర బడ్జెట్ లో నిధులు పెంచాలని..  ఏపీ చేస్తున్న డిమాండ్లను సానుకూలంగా  పరిశీలించి న్యాయం చేయాలని నాట్స్ ప్రెసిడెంట్ మోహన కృష్ణ మన్నవ, చైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ కోరారు.

టీడీపీని టీఆర్ఎస్‌లో విలీనం చేస్తేనే.. ఎన్టీఆర్‌ ఆత్మకు శాంతి

0

అంతరించిపోవటం కంటే.. పార్టీని విలీనం చేయడమే ఉత్తమం అంటూ సీనియర్‌ టీడీపీ నేత మోత్కుపల్లి చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. అదీ ఎన్టీఆర్‌ వర్ధంతి రోజున తెలుగుదేశం పార్టీని విలీనం చేయాలనటం వెనక కారణాలు తెలియాల్సి ఉంది. తెలంగాణ టీడీపీ అంతరించిపోతుంది. టీడీపీకి గౌరవం దక్కాలంటే పార్టీని టీఆర్‌ఎస్ పార్టీలో విలీనం చేయాలని చంద్రబాబుకు మీడియా ముఖంగా విజ్ఞప్తి చేశారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన అనంతరం మోత్కుపల్లి ఈ విధంగా వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ ఘాట్‌కు చంద్రబాబు వచ్చి నివాళులర్పించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో టీడీపీ రోజు రోజుకు అంతరించిపోతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇలాంటి మాటలు వింటుంటే చాలా బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ ఆత్మకు శాంతి చేకూరాలంటే టీడీపీని టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేయాలన్నారు.
దీనిపై ఆ పార్టీలో కలకలం రేపింది. మోత్కుపల్లి వ్యాఖ్యలు వ్యక్తిగతం అంటూ కొట్టిపారేశారు ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్.రమణ. నిన్నటి వరకు మాతోనే ఉన్న ఆయన.. ఇవాళ ఎందుకు అలా మాట్లాడారో అర్థం కావటం లేదన్నారు. విలీనం వ్యాఖ్యల వల్ల కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం దెబ్బతినదని ధీమా వ్యక్తం చేశారాయన. పార్టీ మారతారని కూడా అనుకోవటం లేదని సర్దిచెప్పుకున్నారు. పార్టీని బలోపేతం చేయటానికి కృషి చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు ఎల్. రమణ.
మోత్కుపల్లి వ్యాఖ్యలపైనే మరో టీడీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి స్పందించారు. మోత్కుపల్లి కామెంట్స్ షాక్ కు గురి చేశాయన్నారు. పదవుల కోసం మాట్లాడే వ్యక్తి కాదని.. అలా ఎందుకు మాట్లాడారో తెలుసుకుంటాం అన్నారు. ఆయన వ్యవహారం అధినేత చంద్రబాబు చూసుకుంటారని చెప్పుకొచ్చారు.

అమెరికా వెళ్లాలంటే.. కొత్త క్వాలిఫికేషన్స్ ఇవే

0


కొత్త ఇమ్మిగ్రేషన్ రూల్స్ తీసుకురాబోతున్నది అమెరికా. చదువు, ఉద్యోగం, వ్యాపారం ఇలా వివిధ కేటగిరీల కింద అమెరికా వెళ్లాలనుకునే వారికి ఇమ్మిగ్రేషన్ రూల్స్ లో మూడు అంశాలు జత చేయబోతున్నది. ఈ మూడు అంశల్లో మీరు విధిగా పాస్ అయితేనే వీసా జారీ అవుతుంది ఇక నుంచి. ఈ విధానం ప్రపంచవ్యాప్తంగా ఇండియన్స్ కు బాగా కలిసి వస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మిగతా దేశాలతో పోల్చితే ఇండియన్స్.. ఇంగ్లీష్ బాగా మాట్లాడగలరని చెబుతున్నారు. అమెరికా లైఫ్ స్టయిల్ ను త్వరగా అలవాటు చేసుకోవటంలో ఇండియన్స్ ముందుంటారని చెబుతున్నారు. జాబ్ స్కిల్స్ లో ఇప్పటికే ఇండియన్స్ మిగతా దేశాల కంటే ముందున్నారని.. ఇమ్మిగ్రేషన్ లో కొత్త రూల్స్ వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెబుతున్నారు.
ఈ మూడు అంశాలు ఏంటో చూద్దాం..
ఒకటి :

  • అమెరికాను ప్రేమించాలి.
  • అక్కడి చట్టాలపై కనీస అవగాహన ఉండాలి.
  • అమెరికన్స్ ను గౌరవించాలి.
  • అమెరికా లైఫ్ స్టయిల్ (జీవన విధానం)పై ఇష్టం ఉండాలి. ఒక్క మాటలో చెప్పాలంటే I LOVE AMERICA అని గట్టిగా చెప్పాలి.

రెండు :

  • ఇంగ్లీష్ బాగా వచ్చి ఉండాలి.
  • అమెరికన్ భాష, యాసలో పట్టు ఉండాలి.
  • అమెరికన్స్ చెప్పిందే చెప్పినట్లు మళ్లీ తిరిగి చెప్పగలిగినంత ఇంగ్లీష్ పరిజ్ణానం ఉండాల్సింది.

మూడు :

  • మీరు ఏ జాబ్ కోసం అయితే వీసా దరఖాస్తు చేస్తారో దానిపై పూర్తి అవగాహన ఉండాలి.
  • ప్రాజెక్ట్ వర్క్ ను, అందుకు సంబంధించిన టెక్నాలజీపై పట్టు ఉండాలి.
  • చదువు కోసం వెళుతున్నట్లయితే అక్కడి యూనివర్సిటీలు, విద్యా విధానంపై కనీస అవగాహన ఉండాలి.

ఇమ్మిగ్రేషన్ చట్టంలో ఈ మూడు అంశాలను త్వరలోనే జత చేయనున్నట్లు వైట్ హౌస్ అధికారులు వెల్లడించారు.

'పద్మావత్' బ్యాన్.. సుప్రీంకోర్టుకు నిర్మాతలు..

0

న్యూఢిల్లీ : వివాదాలతో మొదలైన ‘పద్మావత్‌’ చిత్రం ఇంకా వివాదాల్లోనే సాగుతుంది. చిత్ర నిర్మాతలు ఎంత ప్రయత్నించినా విడుదలకు గ్రీన్‌ సిగ్నల్‌ రావట్లేదు. ‘పద్మావత్’ విడుదల వ్యవహారం సెన్సార్ బోర్డ్ దగ్గరే చూసుకోవాలంటూ అప్పట్లో సుప్రీం తెలిపిన విషయం తెలిసిందే. సెన్సార్‌ బోర్డు ఓకే చెప్పినా విడుదల విషయం మాత్రం ఎటూ తెలట్లేదు. జనవరి 25 విడుదల కానున్న ఈ చిత్రం ఇంకా వివాదాల్లోనే మగ్గుతుంది. ఈ చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనైనా అడ్డుకుంటామంటున్నారు ఆందోళనకారులు
ఇదిలా ఉంటే ఇప్పటికే రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, హర్యానా రాష్ట్రాలలో పద్మావత్ విడుదలను నిలిపివేస్తున్నట్లు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. ఇక చిత్ర నిర్మాతలు చేసేది లేక మరోసారి సుప్రీం కోర్టును ఆశ్రయించాలని డిసైడ్‌ అయ్యారు. ఎన్నో కష్టాలనోర్చి రూపొందిచిన ‘పద్మావత్‌’ చిత్రానికి న్యాయం చేయాలంటే.. నిర్మాతలు సుప్రీం కోర్టులో పిటీషన్‌ దాఖలు చేశారు. రేపు విచారణ చేపడుతున్నట్లు తెలుస్తోంది. దీపికా పదుకొనే, రణ్‌వీర్ సింగ్, షాహిద్ కపూర్ ప్రధానపాత్రలలో సంజయ్ లీలా బన్సాలీ తెరకెక్కించిన ‘పద్మావత్’ జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

కత్తి వెర్సస్ పీకే – క‌త్తికి కౌంట‌ర్ ఇచ్చిన కోన‌ వెంకట్‌

0

కత్తి మహేష్‌కి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. జనవరి 15వ తేదీ వరకు అంతా మౌనంగా ఉండండి. దయచేసి మీడియా ఛానెళ్లకు వెళ్లి చర్చల్లో పాల్గొనటం.. పవన్‌కు, ఆయన అభిమానులకు వ్యతిరేకంగా మాట్లాడటం లాంటివి చేయొద్దని కోరుతున్నా. అలా చేస్తే శాంతి చేకూర్చాలన్న ప్రయత్నం విఫలమవుతుంది. అంటూ కోన వెంకట్‌ కత్తికి సూచించిన విషయం తెలిసిందే. కోన ఇచ్చిన గడువు ముగియడంతో కత్తి మహేష్‌ మళ్లీ తన కత్తికి పదును పెట్టాడు.
ఎక్కడున్నారు సర్‌? నేను మౌనంగా ఉన్నప్పటికీ నాతో పాటు నా కుటుంబానికి కూడా పవన్‌ కల్యాణ్‌ అభిమానుల నుంచి వేధింపులు వస్తున్నాయి. ఇప్పుడు చెప్పండి. మీరేం చేయగలరు” అంటూ మళ్లీ టాపిక్‌ రైజ్‌ చేశాడు కత్తి మహేష్. దానికి కోన కూడా ఘాటుగానే సమాధానం ఇచ్చాడు. నేను జనవరి 7న ట్వీట్‌ పెట్టిన తరువాత కూడా నువ్వు ఇదే ఇష్యూపై కొన్ని ఛానెళ్లతో మాట్లాడావు. పవన్‌ కల్యాణ్‌, అతని అభిమానులను ఎటాక్‌ చేసేందుకు పలు విద్యార్థి సంఘాలను కూడా రంగంలోకి దించావు. నీ డిక్షనరీలో సైలన్స్ కి మరో అర్థం ఏదన్నా ఉందా?’ అంటూ ట్వీట్‌ చేశాడు కోన.
సగటు సినీ అభిమానులు మాత్రం కత్తి మహేషూ ఈ గోలేంటి మాకు అంటూ తలలు పట్టుకుంటున్నారు మరి.

బోయపాటితో పవన్ తదుపరి చిత్రం..!!!

0

Pawan Kalyan next movie with Boyapati Srinu
హిట్‌ ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా తన పని తాను చేసుకుపోయే పవర్‌స్టార్‌ పవన్ కళ్యాణ్‌ లేటెస్ట్‌ మూవీ అభిమానులను నిరాశపరిచింది. జల్సా, అత్తారింటికి దారేది రేంజ్‌లో ఉంటుందనుకున్న అజ్ఞాతవాసి అంచనాలందుకోలేకపోయింది. మరో సినిమాతో హిట్‌ కొట్టాలని ఫ్యాన్స్‌ ఆశపడటంలో తప్పులేదు. కానీ త్వరలోనే ఎన్నికలు ఉండటం, జనసేన పార్టీని బలోపేతం చేయడం కూడా పవన్‌ బాద్యత. మరి ఇలాంటి సమయంలో పవన్‌ మరో సినిమా తీస్తాడా అన్నది ప్రశ్న. అయితే సినీ వర్గాలనుండి వినిపిస్తున్న సమాచారం ప్రకారం పవన్‌ మరో సినిమాతో రానున్నడని. రాజకీయ నేపథ్యంలో సాగే కథతో సినిమా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట.
మరి పవన్‌ని డైరెక్ట్‌ చేసేదెవరనేగా మీ డౌట్ …… మాస్‌, ఊర మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను . మొత్తానికి పవన్ కున్న ఇమేజ్ కి బోయపాటి తో సినిమా చేస్తే ….. అది పొలిటికల్ సినిమా చేస్తే బాక్స్ లు బద్దలు కావాల్సిందే . బాలయ్యతో సింహ, లెజెండ్‌, అల్లు అర్జున్‌తో సరైనోడు వంటి బ్లాక్‌ బస్టర్‌లు ఇచ్చిన బోయపాటి.. పవన్‌కు కూడా హిట్‌ ఇస్తాడని ఆశిద్దాం…

దేవుడూ , సెక్సూ, నిజమూ కలగలిసిన మియా మాల్కోవా

0
దేవుడూ , సెక్సూ, నిజమూ కలగలిసిన మియా మాల్కోవా – రామ్ గోపాల్ వర్మ
“గాడ్, సెక్స్ అండ్ ట్రూత్”  సినిమా కాదు, షార్ట్ ఫిల్మ్ కాదు, వెబ్ సిరీస్ కూడా కాదు…ఇది సెక్స్ మీద మియా మాల్కోవా స్వగతం.
“గాడ్, సెక్స్ అండ్ ట్రూత్” మొత్తం ఫైనల్  వీడియో  ఈ జనవరి 26 ఉదయం 9 గంటలకి ‘మియా మాల్కోవా’ పేరుతో ఉన్న అఫీషియల్ విమియో (www.vimeo.com) ఛానల్లో విడుదలవుతోంది.
26న రిలీజ్ అవ్వబోయే ఆ  ఫుల్ వీడియో లో మాల్కోవా సంపూర్ణ నగ్నత్వంలోని అణువణువునీ నా కెమెరాతో ఒక  పెయింటింగ్ లా తీర్చిదిద్దాను.
ఒక  అమ్మాయి నగ్న సౌందర్యాన్ని ఎంత అందంగా చూపించవచ్చు అనే  విషయాన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకుని  యూరోప్ లో ఈ ప్రయత్నం చేయడం జరిగింది.
నా కెమెరా కన్ను ఆమె సుందర  నగ్నశరీరంలోని అంగాంగాన్ని ఆరాధించడమే కాకుండా ఆమె ఆలోచనల్లో వ్యక్తమయ్యే గూఢతని, ఆమెలో నిక్షిప్తమై ఉన్న శృంగార గాఢతని కూడా ఒక  ఆధ్యాత్మిక కోణంలో ప్రకటిస్తుంది.
దేవుడు, సెక్స్ మరియు నిజం లో  మియా మాల్కోవా.. సమాజం అసభ్యం అనుకునే పదజాలాన్ని కూడా  పలుకుతుంది..దానికి  కారణం  ఏది  ఎవరికి సభ్యం, ఏది ఎవరికి అసభ్యం అని అనాది నుంచి  వస్తున్న ప్రశ్నకి  సమాధానమివ్వటానికే.
విపరీత  కట్టుబాట్ల సమాజం, ఒక  పద్ధతి  ప్రకారం అణచిపెట్టిన ప్రకృతిపరమైన  స్వేఛ్చాలోచనల్ని బహిరంగ  పరచడమే ఈ “గాడ్, సెక్స్ అండ్ ట్రూత్” యొక్క ముఖ్య  ఉద్దేశ్యం .
జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఒక మాగాడు తనపై చూపే శృంగారమయమైన ఆరాధనకు లొంగి శారీరకంగా, మానసికంగా ఆనందంలో తేలియాడాలనే స్వేచ్ఛను కోరుకున్న ప్రతి స్త్రీకి ఈ “గాడ్, సెక్స్ అండ్ ట్రూత్” అనే ప్రాజెక్టు  ఒక ప్రతినిధి.
సెక్స్ పరంగా పొందే అపరాధ భావాలని, బలవంతపు బంధాలని, కుహనా నైతిక విలువలని అధిగమించడానికి ఈ “గాడ్, సెక్స్ అండ్ ట్రూత్” అనేది ఒక మహోన్నత సాధనం.
అప్పటి వరకు ఉన్న ఆలోచనలకి అవతల ఏముందో ఆలోచించినప్పుడే ఏ మనిషికైనా ఒక బలమైన తాత్వికత పుడుతుంది. అదే జీవితాన్ని ఒక సరికొత్త కోణంలో దర్శించడానికి దోహదపడుతుంది.
ఈ చిత్రానికి సంగీతాన్ని అందించినది అనేక అవార్డులను పొందిన సుప్రసిద్ధ సంగీత దర్శకులు ఎం.ఎం. కీరవాణి. “గాడ్, సెక్స్ అండ్ ట్రూత్” కి తాను కూర్చిన సంగీతం మియా మాల్కోవా శృంగారంలో నాణ్యతనే కాకుండా ఆమె భావప్రకటనల్లోని ప్రతి సూక్ష్మమైన అంశాన్ని కూడా అత్యంత శక్తివంతంగా వ్యక్తపరచడానికి దోహదపడింది.
సాధారణ స్వరకల్పనలకి అందని మహాద్భుతమైన  “బాహుబలి” కి, ఆధ్యాత్మికతని నిలువెల్లా నింపుకున్న “అన్నమయ్య”కి సంగీతాన్ని కూర్చిన అత్యంత గొప్ప స్వరకవి కీరవాణి సెక్స్  విషయంలో కూడా అంతే నిబద్ధతని చూపడం, మియా మాల్కోవాలోని నిక్షిప్త నిధికి సరితూగే సంగీతాన్ని ఇవ్వటం నన్ను అబ్బురపరిచింది.
మియా మాల్కోవా మీద నాకున్న అత్యంత గౌరవానికి గల కారణం తాను తనకు నచ్చిన విధంగా జీవించే నిర్ణయం తీసుకోవడం, తనకు తోచిన విధంగా సెక్స్ ని ఎంజాయ్ చెయ్యాలనే నిర్ణయం తీసుకోవడం….అంతే కాకుండా  సెక్స్ ని పవిత్రంగా చూస్తూ అందులో మునిగి తేలడానికి సిగ్గు, అపరాధభావం ఉండకూడదని  చెప్పే తన ఆలోచనల వెనక వున్న లోతుల్ని కూడా నేను చూడగలగడం.
ఈ “గాడ్, సెక్స్ అండ్ ట్రూత్” లో మియా మాల్కోవా తన నిజాయితీ లోని శక్తితోటి, తన నమ్మకాలపై ఉన్న పట్టుతోటి,  జగదేక  సుందరిలాంటి తన అందమైన ముఖంలోని అమాయకత్వంతోటి ప్రతి వారిని సమ్మోహనంగా వశపరుచుకుంటుంది.
మియాలోని అందం మరియు తాత్వికత, నిజాయితీ కలగలిసిన మాటల మూలాన సెక్స్ లోని అన్ని అంశాలు కళ్ళు, మెదడున్న ఎవరికైన స్వచ్ఛంగా, పవిత్రంగా, అందంగా కనిపిస్తాయి.
మియా మాల్కోవా ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ కంటే బలమైనది . ఎందుకంటే తాను కేవలం అందం అనే ఆయుధంతో యుద్ధం ప్రకటించి దాపరికాల సరిహద్దులన్నీ దాటి హిపోక్రిటికల్ మానవ సమాజంపై  ధ్వజమెత్తి జయించటానికి  నడుం కట్టుకుంది. .
ఏ మాత్రం కల్తీలేని ఆనందాన్ని ఎన్నో లక్షల మంది ప్రజలకి ఇవ్వడంలో మియా మాల్కోవా ఒక చారిటీ క్వీన్. అందుకనే ఆమె ఆలోచనలని అర్థం చేసుకునే బుర్ర వున్న ప్రతి ఒక్కరు ఆమెకు మనసారా కృతజ్ఞతలు చెప్పి సెల్యూట్ చేస్తారు.
పేరుకుపోయిన సామాజిక కట్టుబాట్లు, దొంగ ముసుగులు, అనవసరమైన సంకెళ్లు అన్నింటినీ ఒక అందమైన నగ్న స్త్రీ నుంచి వచ్చే సహేతుకమైన ఆలోచనలతో పటాపంచలు చేసి ఒక కొత్త సెక్స్ ఒరవడిని సృష్టించడమే ఈ “గాడ్ సెక్స్ అండ్ ట్రూత్” వెనుక ఉన్న ఒక తాత్వికత.
ఒక్క మాటలో చెప్పాలంటే, “గాడ్, సెక్స్ అండ్ ట్రూత్” లో మియా మాల్కోవాని చూసి, విని అర్ధం చేసుకున్న వారందరి మనస్సులో సెక్స్ కి అర్ధమే మారిపోతుంది!!