తెలుగు సినిమాకి మగతనం తెస్తున్నారు

గతంలో నిర్మాత తమ్మరెడ్డి భరద్వాజ ‘‘తెలుగు చిత్రపరిశ్రమలో మగాళ్లు లేరు’’ అంటూ చేసిన వ్యాఖ్యలు ఎవరూ మరిచిపోలేరు. ఇప్పడు ఆ వ్యాఖ్యలపై మరోసారి స్పందించాడు. మూస ధోరణితో కొట్టుమిట్టాడుతున్న తెలుగు సినిమాపై నిరసనతోనే తానీ తరహా వ్యాఖ్యలు చేసినట్లుగా చెప్పిన ఆయన.. గడిచిన ఐదారేళ్లుగా తెలుగుసినిమాలో వస్తున్న మార్పులతో తాను సంతోషిస్తున్నానన్నాడు.
tammareddy-bharadwaja-comments-on-telugu-cinema-industry
‘‘నా స్టేట్ మెంట్ ను వెనక్కి తీసుకునే సమయం వచ్చేసిందనిపిస్తోంది. మెల్లిగా మొలతాడు కట్టిన మగాళ్లు పుట్టుకొస్తున్నారు. తెలుగు సినిమాకి మగతనం తెస్తున్నారు. అష్టాచెమ్మా చూసినప్పుడు మనోళ్లు కొత్తగా ఆలోచిస్తున్నారనుకున్నా. సున్నితమైన భావాలు కలిగిన సినిమాలు ఆడవనుకున్న టైమ్ అది. కానీ.. ప్రేక్షకులు తమ టేస్ట్ బాగుందని నిరూపించారు. కమర్షియల్ స్టార్స్ తో స్టోరీ స్ట్రాంగ్ గా ఉన్న సినిమా చేయొచ్చని వేదంతో క్రిష్ ప్రూవ్ చేశారు. హీరోలుంటేనే తెలుగు సినిమా అనుకునే సమయంలో ఈగ దోమా కూడా హీరో అయిపోవచ్చని బాక్సాఫీసు దగ్గర ప్రూవ్ చేసిన సినిమా ఈగ. ఇష్క్.. మనం.. ఎక్స్ ప్రెస్ రాజా.. రన్ రాజా రన్.. ఒక ప్రేమకథా చిత్రమ్.. ఉయ్యాల జంపాలా చిత్రాలతో కొత్త పోకడలు వస్తున్నాయి. అలానే తాజా పెళ్లి చూపులు చిత్రం ఒక పాథ్ బ్రేకింగ్ సినిమా అవుతుంది’’ అని చెప్పుకొచ్చారు.

Copyright © 2015 www.telugu24.com