‘జనతా గ్యారేజ్’ లో అవంతిక ఐటమ్ సాంగ్ ?

‘యంగ్ టైగర్ ఎన్టీఆర్’ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ‘కొరటాల శివ’ దర్శకత్వంలో చేస్తున్న సినిమా ‘జనతా గ్యారేజ్’ షూటింగ్ శరవేగంగా సాగుతుంది. ఇటీవలే రిలీజైన చిత్ర టీజర్ సుమారు 50 లక్షల వ్యూస్ అందుకుని రికార్డ్ సృష్టించింది. మరి ఈ చిత్రానికి మరో ఆకర్షణ జోడించనున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ మాస్ పాటలకు మాస్ స్టెప్పులతో ఇరగదీస్తాడు అలాంటిది జూనియర్ సినిమాలో మాస్ మసాల పాట ఉండకపోతే ఎలా?? జనతా గ్యారేజ్ లో అది కూడా ఉంటుందట. ఓ స్పెషల్ ఐటమ్ సాంగ్ లో స్టార్ హీరోయిన్, మిల్కీ బ్యూటీ తమన్నా ఆడి పాడనుందట.
Tamannah Bhatia item Song in janatha Garrage
ప్రీ క్లైమాక్స్ కు ముందుగా వచ్చే ఈ సాంగ్ ప్రత్యేకంగా మాస్ ఆడియన్స్ కోసమే రూపొందించనున్నట్టు కూడా తెలుస్తోంది. ఇకపోతే తమన్నా గతంలో కూడా అల్లుడు శ్రీను, స్పీడున్నోడు వంటి చిత్రాల్లో ఐటమ్ పాటల్లో మెరిసిన సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో తారక్ సరసన సమంత, నిత్య మీనన్ లు హీరోయిన్లుగా నటిస్తుండగా ఈ చిత్రం సెప్టెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Copyright © 2015 www.telugu24.com