హ‌వ్వ‌.. ప‌వ‌న్‌, మ‌హేష్‌, ర‌జ‌నీల‌పై సంపూ సెటైర్‌

Sampoornesh babu Satires On Star Heros
ఈ 2016 కి ఏమైంది? ఓ పక్క సర్ధార్ గబ్బర్ సింగ్ – మరోపక్క బ్రహ్మోత్సవం. కబాలి కూడా నోరు మెదపలేదు. ఈ నిర్లక్ష దోరణికి “కొబ్బరిమట్ట” పాడాలి చరమగీతం.. అని సంపూ తాజాగా ట్వీట్ చేశాడు. పెద్ద పెద్ద హీరోల సినిమాలు ఫెయిల్ అయ్యాయని చెబుతూనే.. తన కొబ్బరి మట్ట సినిమాను తనదైన శైలిలో ప్రమోట్ చేసుకునే ప్ర‌య‌త్నం చేశాడు. ఈ మధ్యకాలంలో భారీ అంచనాలతో విడుదలవుతున్న భారీ సినిమాలు వరుసగా ఫ్లాప్ అవ్వడంతో సంపూ చేసిన ట్వీట్ కి ఫుల్ మైలేజ్ వచ్చింది.

ఇవే వ్యాఖ్య‌లు వేరే ఎవ‌రైనా చేసుంటే వివాదం ముదిరేదే.. కానీ చేసింది ఎవ‌రు బ‌ర్నింగ్ స్టార్ సంపూ… అందుకే అంతా లైట్ తీసుకుని న‌వ్వుకున్నారు. కానీ స‌ద‌రు స్టార్ హీరోల ఫ్యాన్స్ మాత్రం ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. అది అలా ఉంటే సంపూ చెప్పింది అబ‌ద్ధం కాదుగా అంటూ సంపూ ఫ్యాన్స్ వాద‌న‌

Copyright © 2015 www.telugu24.com