సల్మాన్ ఖానే ఆ జింకను చంపాడు.. షాకిచ్చిన జీపు డ్రైవర్!

1998నాటి కృష్ణజింకల కేసులో నిర్దోషిగా బయటపడిన కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు షాక్ తగిలింది. ఈ కేసు తొలినాళ్లలోనే జీపు డ్రైవర్ హరీష్ సల్మాన్ ఖాన్ జింకను వేటాడినట్టు చెప్పాడు కానీ 2002 నుంచి హరీష్ కనిపించకుండా పోయాడు. కోర్టు తీర్పు అనంతరం స్పందించిన హరీష్.. సల్మాన్ తో కలిపి దేశం మొత్తానికి షాకింగ్ విషయం చెప్పాడు.

సల్మాన్ అడవిలో వేటకు వెళ్లినప్పుడు ఆ జీపు డ్రైవర్ తానేనని చెప్పుకొచ్చిన హరీష్ దులానీ.. ఆ సమయంలో సల్మాన్ జీపు దిగి.. వేటాడి వేటాడి కృష్ణ జింకలను చంపాడని – ఆనాడు కోర్టులో చెప్పిన తన మాటలకు ఇప్పటికి కట్టుబడే ఉన్నానని కచ్చితంగా సల్మానే ఆ జింకలను చంపాడని చెప్పాడు. ఇదే సమయంలో తనకు ఏమాత్రం రక్షణ కల్పించి ఉన్నా.. కచ్చితంగా కోర్టులో సాక్ష్యం చెప్పిఉండేవాడినని డ్రైవర్ హరీష్ తెలిపాడు. మరి ఇన్నిరోజులు ఎందుకు కన్పించకుండా పోయావన్న పశ్రకు జవాబుగా “తన కుటుంబాన్ని బెదిరించారని అందుకే తాను భయపడి జోధ్పూర్ ను వదిలి వెళ్లిపోయాయని” చెప్పాడు.

Copyright © 2015 www.telugu24.com