తిక్క చూపించాడుగా.. తిక్క టీజర్ విడుదల

జగమే మాయ.. బతుకే మాయ అంటూ టీజర్ స్టార్ట్ చేశాడు దర్శకుడు సునీల్ రెడ్డి. మొత్తానికి టీజర్ చూస్తే సాయి పాత సినిమా ఛాయలు ఇందులో లేవు. డ్యాన్సులు, మామలను గుర్తు చేస్తు చెప్పే డైలాగులు లేవు. నిమిఫం నిడివిగల ఈ టీజర్ చూస్తే యూత్ లవ్ స్టోరీతో మాస్ కుమ్ముడుంటుందనైతే అర్థమౌతుంది. సాయిధరమ్‌తేజ్‌, లరిస్సాబోన్సి, మన్నారచోప్రా నాయకానాయికలు నటిస్తున్నారు. జూలై 30న ఆడియో విడుదల చేస్తారు. ఆగస్టు 13న సినిమా ప్రేక్షకుల ముందుకువస్తుంది.

ఇంకా ఈ చిత్రంలో ముమైత్‌ఖాన్‌, పరా కరిమీ, రాజేంద్రప్రసాద్‌, పోసాని, అలీ, సప్తగిరి, తాగుబోతు రమేష్‌, వెన్నెల కిషోర్‌, అజయ్‌, రఘుబాబు తదితరులు తారాగణం. ఈ చిత్రానికి మాటలు: హర్షవర్ధన్‌, ఛాయాగ్రహణం: కె.వి.గుహన్‌, సంగీతం: తమన్‌.

Tikka-teaser-released

అయితే ఈ ట్రైలర్ లో ఎక్కడ కూడా మెగా ఛాయలు కన్పించకుండా చూసుకున్నారు.న్న రాత్రి మెగా అభిమానులు టీజర్ కోసం ఆసక్తిగా ఎదురు చూశారు. కొన్ని గంటల ముందు నుంచే ‘తిక్క’ టీమ్ కౌంట్ డౌన్ కూడా మొదలుపెట్టి అభిమానుల్ని ఊరించింది. కానీ ఏడున్నర అవ్వగానే.. కొన్ని సాంకేతిక కారణాల వల్ల టీజర్ గంట ఆలస్యం వస్తుందని ప్రకటించారు. సర్లే అని ఇంకో గంట వెయిట్ చేస్తే మళ్లీ నిరాశ తప్పలేదు. అప్పుడు కూడా టీజర్ రిలీజవ్వలేదు.

“ప్రేమంటే బబుల్ గమ్ లాంటిది ఫస్ట్ తియ్యగుంటది.. తర్వాత సప్పగైతది అంటూ రమేష్ డైలాగ్.. దోస్తాన్ అనుకో చాక్లెట్ లెక్క తిన్నా కొద్ది తియ్యగుంటది..”

Copyright © 2015 www.telugu24.com