రజనీ కబాలి విశ్వరూపం.. ఎనీ డౌట్స్..?

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కబాలి థియేటర్లను తాకింది. విడుదలకు ముందే రికార్డులు బ్రేక్ చేస్తూ రజనీ స్టామినాను మరోసారి చాటింది. రజనీ ఓ నటుడు మాత్రమే కాదు ఆయనో శక్తి దానికి తార్కానమే కబాలి మేనియా. రూ.100 కోట్లలోపు బడ్జెట్తో నిర్మించిన కబాలి సినిమా విడుదలకు ముందే రూ.200 కోట్లకు పైగా సంపాదించింది. ఈ సినిమా ఓవర్సీస్ రైట్లు రూ.30 కోట్లు, తెలుగు హక్కులు రూ.30 కోట్లు. కన్నడ, మల యాళ హక్కులు రూ.15 కోట్లు. హిందీ శాటిలైట్ హక్కులు రూ.10 కోట్లు, హిందీ థియేట్రి కల్ (థియేటర్లలో విడుదల) హక్కుల ధర రూ.5 కోట్లు. ఇక తమిళనాడులో రూ.5 కోట్లకు డిస్ట్రి బ్యూటరు కౌనుగోలు చేశారు. తమిళనాట శాటిలైట్ హక్కులు మరో రూ.30 కేట్లు. మ్యూజిక్ రైట్స్. రూ.5 కోటు. అన్నీ కలిపితే. 206 కోట్లు.
Rajinikanth Kabali Records
ఇక కబాలీ సినిమా బ్రాండింగ్ టై ఆప్ ల ద్వారా సంపాదించిన సొమ్ము వేరే. మొత్త మ్మీద, కబాలీ సినిమా రూ.500 కోట్లకు పైనే సంపాదిస్తుందని నిర్మాత కలైపులి థాను బహిరంగంగానే ప్రకటించారు. ఇప్పటికే తమిళనాడు రజనీను తలపించేలా కబాలి కటింగ్లు. టీషరులతో యువత రజనీ జపం చేస్తున్నారు. తలైవర్ కటౌట్లకు క్షీరాభిషేకాలు. ఆలయాల్లో పూజలు, అన్నదానాలు, వస్త్రదానాలు చేస్తు న్నారు. కర్ణాటకలో ఈ సినిమా ప్రదర్శనపై కన్నడ సినిమా సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న నియమాల ప్రకారం. పరభాషా చిత్రాలు విడుదలైన ఏడు వారాల తర్వాతనే కర్ణాటకలో ప్రదర్శించాలని గుర్తుచేస్తున్నారు.

ఇదీ కబాలి విశ్వరూపం
156.ఇది రజనీ 156వ సినిమా
3900:ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం కూలి సినిమా ప్రదర్శించబోయే ప్ర్కీన్లు
400:అమెరికాలో చిత్రాన్ని ప్రదర్శించే ప్ర్కీన్లు. వీటిలో సగం తెలుగు సగం తమిళ్.
1000: ఉత్తరాదిన కబాలి హిందీ వెర్షన్
1000 స్క్రీన్లలో విడుదల అవుతోంది.
290 కోట్లు ఇప్పటిదాకా తమిళనాట ఒక సినిమా సాధించిన అత్యధిక వసూళ్లు. ఈ రికార్డు రజనీ సినిమానే అయిన రోబో పేరిట ఉంది.
100 కోట్లు:సుల్తాన్ సినిమా మూడు రోజుల్లో సాధించిన వసూళ్లు అంతకు ముందు ధూమ్ , హ్యాపీ న్యూ ఇయర్, బజ్రంగీ భాయీ జాన్. ప్రేమ్ రతన్ ధన్ పాయో కూడా ఇదే పీట్ సాధించాయి. కబాలి. రిలీజ్కు ముందే 200 కోటు మార్కు దాటేసింది కాబట్టి పోటీయే లేదు.

Copyright © 2015 www.telugu24.com