కారు అమ్మేసిన పవన్ కళ్యాణ్.. ఆర్థిక ఇబ్బందులే కారణమా..?

పవన్ కళ్యాణ్ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాడా?? మరెందుకు ఆయనకు అత్యంత ఇష్టమైన మెర్సిడెజ్ బెంజ్ కారును అమ్మేశారు? ఇపుడు ఇదే అంశంపై ఫిల్మ్ నగర్‌లో హాట్ టాపిక్ మారింది. దాదాపు నాలుగేళ్ల క్రితం పవన్ మెర్సిడెజ్ బెంజ్ జి55 మోడల్ కానును కోనుగోలు చేశాడు. ఈ కారులోనే రామ్ చరణ్ పెళ్లి సమయంలో చెర్రీని పెళ్లి మండపానికి తీసుకొచ్చాడు. అయితే, ఈ మధ్య వరుస ఫ్లాపులు రావడం, పైగా, సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో నిర్మాణం భాగస్వామ్యం ఉండడం, ఆ సినిమాతో భారీ నష్టాలు రావడంతో.. పవన్‌ ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డాడని, చాలా ఇబ్బంది పడుతున్నాడని ఫిలింనగర్ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి.

Pawan Kalyan Sold His Benz Car For Financial Problems
దీని విలువ దాదాపు రూ.2 కోట్లు కాగా, మరో కారును కొనాలని ఆయన భావించి ఉంటే, ఆ పని చేసిన తర్వాతే దీన్ని విక్రయించేవారని, పవన్ కారు కొనలేదు కాబట్టి ఇబ్బందుల వల్లే దీన్ని అమ్మేశారని పుకార్లు వినిపిస్తున్నాయి. నిజంగా పవన్ దగ్గర డబ్బులు లేకపోతే ఓ సినిమా చేయడానికి సంతకం పెడితే చాలు కోట్లాది రూపాయలను ఆయనకు ముట్టజెప్పేందుకు నిర్మాతలు సిద్ధంగా ఉంటారు. అలాంటి పవన్ కోటి రూపాయల కోసం కారును అమ్ముకున్నాడటంలో వాస్తవం లేదని భావించవచ్చు. అయితే కొద్ది కాలం క్రితం ఇంటర్వ్యూ సందర్భంగా తను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని పవన్ చెప్పడం ఈ రూమర్లకు బలాన్నిచ్చింది.

Copyright © 2015 www.telugu24.com