చిరంజీవి ఖైదీ 150 కాదంట.. నెపోలియన్ ఫిక్స్..?

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా టైటిల్ కత్తిలాంటోడు, ఖైదీ 150 అంటూ నిన్న మొన్నటి వరకు అనుకున్న ఇప్పుడు కొత్త టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. నెపోలియన్.. ఇదీ చిరు 150 టైటిల్. పోరాటం అతడి నైజం అనేది ట్యాగ్ లైన్ అట. ఈ టైటిల్ తో లోగో కూడా ఒకటి ట్విట్టర్లో హల్ చల్ చేస్తోంది. అది అఫీషియల్ కాకపోవచ్చు.. కానీ టైటిల్ మాత్రం నెపోలియన్ అన్నది కన్ఫమ్ సమాచారం. ఓ ప్రముఖ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ తన అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో చిరు 150 టైటిల్ నెపోలియన్ అని ప్రకటించడంతో ఇది కన్ఫర్మ్డ్ న్యూస్ అనే భావిస్తున్నారు అభిమానులు.

Megastar chiranjeevi 150th Movie Title napoleon చిరు 150 షూటింగ్ నెల రోజుల కిందటే మొదలైంది. రామోజీ ఫిలిం సిటీలో జరిగిన తొలి షెడ్యూల్లో కొన్ని యాక్షన్ సీన్స్ తీశారు. తర్వాత రెండో షెడ్యూల్ కూడా మొదలైంది. ఈ మధ్యే ఫేస్ బుక్ చాట్ లో భాగంగా ఈ చిత్రానికి కత్తిలాంటోడు అనేది వర్కింగ్ టైటిల్ మాత్రమే అని.. అసలు టైటిల్ ఏంటో ఇంకా నిర్ణయించలేదని రామ్ చరణ్ చెప్పాడు. తమిళ బ్లాక్ బస్టర్ ‘కత్తి’కి రీమేక్గా వస్తున్న ఈ చిత్రానికి వి.వి.వినాయక్ దర్శకత్వం వహిస్తుండగా.. చరణే నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. టై

మొన్న హిట్లర్, నిన్న స్టాలిన్, నేడు నెపోలియన్.. మరి మెగా కాంపౌండ్ ఈ టైటిల్ అయినా కన్ఫార్మ్ చేస్తుందో లేదో వేచి చూడాలి…

Copyright © 2015 www.telugu24.com