మెగా ఫ్యాన్స్ కు ‘తిక్క’ రేగింది

నిన్న రాత్రి మెగా అభిమానులు టీజర్ కోసం ఆసక్తిగా ఎదురు చూశారు. కొన్ని గంటల ముందు నుంచే ‘తిక్క’ టీమ్ కౌంట్ డౌన్ కూడా మొదలుపెట్టి అభిమానుల్ని ఊరించింది. కానీ ఏడున్నర అవ్వగానే.. కొన్ని సాంకేతిక కారణాల వల్ల టీజర్ గంట ఆలస్యం వస్తుందని ప్రకటించారు. సర్లే అని ఇంకో గంట వెయిట్ చేస్తే మళ్లీ నిరాశ తప్పలేదు. అప్పుడు కూడా టీజర్ రిలీజవ్వలేదు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ లైన్లోకి వచ్చి.. టీజర్ మ్యూజిక్ మిక్సింగ్ పూర్తి కాలేదని.. ఫైనల్ ఔట్ పుట్ విషయంలో సంతృప్తి చెందకపోవడం వల్లే టీజర్ ఆపేశామని చావుకబురు చల్లగా చెప్పాడు. అయినా టీజర్ రిలీజ్ చేయబోతున్నట్లు కొన్ని రోజుల ముందే ప్రకటించినపుడు.. అలా చివరి నిమిషంలో హడావుడి పడ్డమేంటి.. చివరికి ఔట్ పుట్ విషయంలో సంతృప్తి చెందకపోవడం ఏంటి.. అని జనాలకు అర్థం కాలేదు. మొత్తానికి ‘తిక్క’ టీజర్ కోసం ఆసక్తిగా ఎదురు చూసిన మెగా అభిమానులకు ఈ పరిణామాలు తిక్క రేగేలా చేశాయి.

Mega Fans Disappointed with Thikka Movie Team
ఊరించి ఊరించి ఉస్సూరుమనిపించింది ‘తిక్క’ టీమ్. ఈ సినిమా ఫస్ట్ టీజర్ బుధవారం రాత్రి ఏడున్నరకు రిలీజ్ చేస్తామంటూ రెండు మూడు రోజుల నుంచి ఊదరగొట్టేస్తోంది ‘తిక్క’ టీమ్. ఈ విషయంలో మరింత హైప్ తేవడం కోసం ముందు రోజు ధనుష్ ఈ సినిమా కోసం పాట పాడుతున్న విషయాన్ని రివీల్ చేశారు. దీంతో ట్విట్టర్ లో తిక్క హైదరాబాద్ టాప్ ట్రెండింగ్స్ లో ఉంటూ వచ్చింది.

Copyright © 2015 www.telugu24.com