కొరటాల మహేష్ కాంబినేషన్ లో మరో శ్రీమంతుడు

మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ ఇలా చకచకా చేసేసి, ఇప్పుడు మరోసారి మహేష్ సినిమాకు రెడీ అయిపోయారు. మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా శ్రీమంతుడు. మహేష్ కెరీర్లోనే బిగెస్ట్ హిట్గా నిలిచిన ఈ సినిమా నాన్ బాహుబలి రికార్డులన్నింటిని బద్దలు కొట్టింది. తనకు శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్ ప్లస్ మంచి సినిమా ఇచ్చిన కొరటాల శివతో మరో సినిమా చేయడానికి మహేష్ బాబు ఫిక్సయిపోయాడు. ప్రస్తుతం కొరటాల శివ ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నారు. ఆ సినిమా తరువాత నిర్మాత డివివి దానయ్యకు చేయాల్సి వుంది. దానయ్య కు హీరో రామ్ చరణ్ సినిమా చేయాల్సి వుంది. సో, ఆ విధంగా దానయ్య-చరణ్-కొరటాల శివ సినిమా ఫిక్స్ కావాల్సి వుంది. కానీ గడచిన రెండు రోజుల్లో చకచకా కొన్ని పరిణామాలు జరిగినట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

మహేష్ కొరటాల శివ తో ఎలాగైనా తరువాతి సినిమా చేయాలని పట్టుదలగా వున్నట్లు వినికిడి. దాంతో నిర్మాత దానయ్యతో సిట్టింగ్ లు జరిగాయని వార్తలు వినిపిస్తున్నాయి. దానయ్య కూడా కాస్త భారీ మొత్తమే మహేష్ కు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.15కు పైనా 20కి లోపల ఈ మొత్తం వున్నట్లు తెలుస్తోంది.
koratal Next movie with Mahesh babau

Copyright © 2015 www.telugu24.com