150 హీరోయిన్ ఫిక్స్.. చిరు సరసన కాజల్

Kajal Aggarwal heroin for megastar chiranjeevi 150th Film
అనుష్క..తమన్నా..నుంచి జాక్విలిన్ ఫెర్నాండెజ్ వరకు ఎన్ని పేర్లు..ఎన్ని సంప్రదింపులు, ఆఖరికి హీరోయిన్ లేకుండానే సినిమా రెండో షెడ్యూలు లోకి వచ్చేసింది. ఇక ఇప్పుడు హీరోయిన్ ఫైనల్ అయిందని విశ్వసనీయ వర్గాల బోగట్టా.

కాజల్ ను మెగాస్టార్ సరసన ఫిక్స్ చేసేసారని వినికిడి. కొడకు రామ్ చరణ్ తో మగధీర తదితర చిత్రాలు, సోదరుడు పవన్ తో సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాల్లో జోడీ కట్టి, ఆడి పాడిన కాజల్ ఇప్పుడు మెగాస్టార్ తో ఆడి పాడబోతోంది. ఇందుకు కోటిన్నర వరకు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. జాక్విలిన్ ఫెర్నాండెజ్ డిమాండ్ చేసినా మూడు కోట్లకు పైగా కన్నా ఇది తక్కువేగా.

Copyright © 2015 www.telugu24.com