కత్తి కాదు.. ఖైదీ నెంబర్ 150

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం అప్పడు ఇప్పుడు అంటూ మొత్తానికి తమిళ హిట్ మూవీ కత్తి రీమేక్ చేస్తున్నారు. కాగా ఈ సినిమాకు కత్తిలాంటోడు అనే టైటిల్ పెడుతున్నట్లు గాసిప్ లు చాలానే వచ్చాయి. కానీ తన తండ్రి 150వ చిత్రం పేరు కత్తిలాంటోడు కాదంటూ రామ్ చరణ్ కుండలు బద్దలు కొట్టాడు. ఈ సినిమాలో చాలా సీన్లలో చిరు జైల్లో కన్పిస్తాడు, చిరు వేసుకున్న ఖైదీ డ్రెస్ పైన కూడా 150 అని రాసి ఉంచారు. ఖైదీ అనే టైటిల్ చిరుకు బాగా కలిసి వచ్చింది కూడాను. అందుకే ఖైదీ నెంబర్ 150 పేరును ఖరారు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.
chiranjeevi 150 Movie Title Khaidi 150 fixed

Copyright © 2015 www.telugu24.com