రజనీకి భారతరత్న ఇవ్వాలి..

రజనీకాంత్ ఓ హీరో మాత్రమే కాదు ఆయనో శక్తి.. నిజజీవితంలో కూడా హీరోలా వ్యవహరించే మంచి మనసున్న మహోన్నత వ్యక్తి. ఎందరు స్టార్లున్నా రజనీతో సరితూగని వ్యక్తిత్వం రజనీ సొంతం. అలాంటి రజనీకాంత్ కు అత్యున్నత పురస్కారం భారత రత్న ప్రధానం చేయాలంటూ బీజేపీ ఎమ్మెల్లయే కోరుతున్నారు.
bjp-mla-proposesn-bharatha-ratna-for-rajinikanth
మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే అనిల్ గోటే ఓ అరుదైన ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. దేశంలో అత్యున్నత పౌర పురస్కారమైన ‘భారత రత్న’ను రజనీకాంత్‌కు ప్రదానం చేయాలని ఆయన కోరారు. మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే అత్యున్నత పురస్కారం ‘మహారాష్ట్ర భూషణ్‌’ను రజనీకాంత్‌కు ఇవ్వాలని ఆయన దేవేంద్ర ఫడ్నవిస్‌ సర్కారుకు ప్రతిపాదించారు. పనిలో పనిగా రజనీకాంత్‌కు ‘భారత రత్న’ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ మహారాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయాలని ఆయన కోరారు. రజనీని మహారాష్ట్ర భూమిపుత్రుడిగా అభివర్ణించిన ఎమ్మెల్యే గోటే.. ఆయన అభిమానులకు దేవుడితో సమానమని, తాజా సినిమా సక్సెస్‌ సినీ పరిశ్రమలో రజనీకున్న స్థానాన్ని చాటుతున్నదని పేర్కొన్నారు.

Copyright © 2015 www.telugu24.com