అమలాపాల్ విడాకులు నిజమే.. అంతా సమంతవల్లే

దర్శకుడు విజయ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న అమలాపాల్.. రెండేళ్ల వ్యవధిలోనే అమలాపాల్ వైవాహిక జీవితం ముగిసింది. ఇప్పటి వరకు అమలా పాల్ విడాకులు అంటూ వచ్చిన వార్తలన్నీ గాసిప్ లుగానే మిగిలినా.. తన కొడుకు.. అమలాపాల్ విడిపోయినట్లుగా విజయ్ తండ్రి ఏఎల్ అళగప్పన్ స్వయంగా ధ్రువీకరించటంతో ఇప్పటివరకూ గాసిప్ గా ఉన్న అంశం.. ఇప్పుడు నిజమైంది. విజయ్ కూడా అమలాపాల్ ప్రస్తావన అనవసరమని.. తన తల్లిదండ్రులు ఎలా చెబితే తాను అలా నడుచుకుంటానని చెప్పటం గమనార్హం.
amala-Paul
వీరిద్దరూ విడిపోవటానికి కారణం ‘వడ చెన్నై’ సినిమాగా చెబుతున్నారు. సినిమాలో యాక్ట్ చేసే విషయంలో దర్శకుడు విజయ్.. అతని కుటుంబీకులకు ఇష్టం లేకపోవటం.. ఈ సందర్భంగా తలెత్తిన మనస్పర్థలు పెరిగి పెద్దవై.. చివరకు వారు విడాకులు తీసకునే వరకూ వెళ్లినట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో యాక్ట్ చేయటానికి సమంతకు అవకాశం వస్తే.. ఆమె దాన్ని తిరస్కరించటం.. తన బదులు అమలాపాల్ అయితే బాగుంటుందని చెప్పటమేకాదు.. అమలాపాల్ ను ఒప్పించే విషయంలో సమంత పాత్ర ఉందన్న వాదన ఉంది.

Copyright © 2015 www.telugu24.com