సోషల్ మీడియా వాడకంలో అమ్మాయిలే టాప్..

ఫేస్ బుక్ – ట్విటర్ – ఇన్ స్టాగ్రామ్.. ఇలా ప్రతి సోషల్ మీడియా సైట్ యువతకు హాట్ ఫేవరెట్. అయితే… తాజాగా తెలిసిన కొత్త విషయం ఏంటంటే యువతలో అమ్మాయిలు ఈ విషయంలో మరింత స్పీడుగా ఉన్నారట. సోషల్ మీడియాను వాడకం అలా ఇలా కాదు గంటల తరబడి అందులోనే గడిపేస్తున్నారట. ఇంటర్నెట్ వాడే వారిలో ఫేస్ బుక్ యూజర్లుగా ఉన్న అమ్మాయిల శాతం 76గా ఉందని తేలింది. ట్విట్టర్ వాడకంలోనూ ఫీమేల్ యూజర్లదే పైచేయి అట. పింట్రెస్ట్ – ఇన్ స్టాగ్రామ్ విషయంలోనూ ఇదే పరిస్థితి. వీటికీ అమ్మాయిల ఆదరణే ఎక్కువగా ఉంది. ఈ గణాంకాలన్నీ పాశ్చాత్యదేశాల్లోనివే సుమీ..

మరి ఇండియాలో ఈ లెక్కలను రిలీజ్ చేయనప్పటికీ ఇక్కడ అమ్మాయిల కంటే అబ్బాయిల వాడకమే ఎక్కువ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. మన దగ్గర అబ్బాయిలే టాప్ అన్నమాట..
Women Top in Social Media Usage

Copyright © 2015 www.telugu24.com